జూబ్లీహిల్స్.నవంబర్9(రాజధాని న్యూస్) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో దీపావళి వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తలసాని బాణసంచా కాల్చి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కాంతుల పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ సంతోషారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
కామెంట్లు