అమీర్ పేట్,నవంబర్9(రాజధాని న్యూస్) : సనత్ నగర్ నియోజకవర్గం, అమీర్పేట్ డివిజన్ పరిధిలోని సత్యం థియేటర్ సర్కిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ జనరల్ సెక్రటరీ ముద్దారపు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో డాక్టర్ కోట నీలిమ, దీపక్ జాన్ కలసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత కాలం సేవలందించాలని వారు ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలలో భాగంగా స్థానిక ప్రజలకు గొడుగులను పంపిణీ చేశారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట : డాక్టర్ కోట నీలిమ :
డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి, ప్రగతికి ప్రాధాన్యమిస్తూ ప్రజాపాలన కొనసాగుతోందని కొనియాడారు. మహిళలు, రైతులు, పేదలు, యువత, కార్మికులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తెలంగాణను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గొడుగుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టి వారి మధ్య ఉండటమే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ముఖ్య బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కామెంట్లు