ఎర్రగడ్డ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసిన అనంతరం బట్టలు పంపిణీ
- ఆశ్రమం పిల్లలకు అన్నదాన కార్యక్రమం
- డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ
జూబ్లీహిల్స్,నవంబర్9(రాజధాని న్యూస్) : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్ సొసైటీలోని " శ్రీ ఆదర్శ ఫౌండేషన్ " లో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి. రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ అనాథ పిల్లలతో కలిసి రవి శేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశయమే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఆయన పోరాట పటిమ, నాయకత్వ గుణాలు కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అపారమైన ప్రజాదరణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ కోటేశ్వర్ రావు, సారథినగర్ సొసైటీ అధ్యక్షుడు పి. కోటేశ్వర్ రావు, గ్రేటర్ హైదరాబాద్ హెచ్.ఆర్. మెడికల్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ దుర్గారావు, గ్రేటర్ హైదరాబాద్ బీసీ చైతన్య వేదిక కార్యదర్శి టి. వినోద్ కుమార్, మాల మహానాడు గ్రేటర్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు